ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం మక్తల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలను ఎమ్మెల్యే శ్రీహరి పరిశీలించారు. పునరుత్పాదక శక్తి వనరులు అనే అంశం పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలను పరిశీలించారు.