మక్తల్: పేకాట శిబిరంపై పోలీసుల దాడులు

61చూసినవారు
మక్తల్: పేకాట శిబిరంపై పోలీసుల దాడులు
మక్తల్ మండలం టేకుల పల్లి గ్రామ శివారులో శనివారం డబ్బులు పెట్టి బెట్టింగ్ కాస్తూ పేకాట ఆడుతున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 19 వెలు, 10 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్