నాగర్ కర్నూల్: విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

83చూసినవారు
తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగనూలు కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కావడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రేమలత, అక్షయతో పాటు మరో విద్యార్థికి వాంతులు, విరోచనాలు, దగ్గు రావడంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బయటి ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని కస్తూర్బా సిబ్బంది వెల్లడించారు.

సంబంధిత పోస్ట్