నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు గురువారం మృతిచెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), ఈదమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.