సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు బుధవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ సెల్ ఫోన్లు అందించారు. మొత్తం సుమారు రూ 7 లక్షల విలువ గల 47 మందికి ఫోన్లను అందించారు. ఎవరైనా తమ విలువైన స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి వాటిని రికవరీ చేస్తామని అన్నారు.