విజయోత్సవ వేడుకల్లో మంటలు.. MLA అభ్యర్థి పాటిల్‌కి గాయాలు (వీడియో)
మహారాష్ట్రలో శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చండీగఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా కొందరు మహిళలు హారతులు ఇస్తున్న క్రమంలో.. కెమికల్ కలిసిన రంగులను బుల్డోజర్ నుంచి చల్లుతుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పాటిల్‌తో సహా పలువురు మహిళలు గాయపడ్డారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.