జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
TG: ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రైతుల పొలాల్లోకి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వదిలితే.. ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మనిషికి అన్నం పెట్టే రైతుల భూములు నాశనం చేసిన రూ.కోట్లు సంపాదిస్తారాని ఆయన పారిశ్రామికవేత్తలపై ఫైర్ అయ్యారు.