బెల్లంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. తల్లితండ్రులు పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలు, జాగ్రత్తలను వివరించారు. ఇంటి నుంచి బయటికి బయలుదేరిన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.