జాతీయ జెండాను ఆవిష్కరించిన కళాశాల ప్రిన్సిపాల్

57చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన కళాశాల ప్రిన్సిపాల్
బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆవు నూరి అంజయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు పోటీలు నిర్వహించి ప్రిన్సిపాల్ వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సోమయ్య, లెక్చరర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్