బెల్లంపల్లి ఏరియా గోలేటి కైరిగూడ నూతన మేనేజర్ గా శంకర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం ఏరియా నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఓపెన్ కాస్ట్ లో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు యూనియన్ సంఘాల నాయకులు, కార్యాలయం సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధికారులు, కార్మికులు ఉన్నారు.