రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ లోని రాజీవ్ చౌక్ లో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహిళలు మనోభావాలు దెబ్బతినేలా చేసిన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.