గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాలలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం రక్తదాతలకు రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి. మధుసూదన్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ కెఎన్ అజయ్ మణికుమార్, అదాని గ్రూప్ మేనేజర్ సునీల్, ఎంసీసీ అధికారి అనిల్ కుమార్ పాల్గొన్నారు.