హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం

58చూసినవారు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆంక్షలు విధించి రైతులకు అన్యాయం చేసిండన్నారు. వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్