ఆరిజన్ డైరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణ పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదినారాయణను శుక్రవారం ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదినారాయణను ప్రజల సమక్షంలో నగ్నంగా చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేశారన్నారు.