జన్నారం మండలంలోని పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెద్ద వాగు తో సహా మహ్మదాబాద్ కొడిసేలా వాగు శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వాగు పక్కనే ఉన్న బుడగ జంగాల కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వాగు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.