Oct 19, 2024, 08:10 IST/
మూసీ పక్కన మూడేళ్లు ఉండేందుకు సిద్ధమే: కేటీఆర్
Oct 19, 2024, 08:10 IST
ఇటీవల తనను మూసీ పక్కన మూడు నెలలు ఉండాలని రేవంత్ చేసిన సవాల్‌పై కేటీఆర్ స్పందించారు. 'మూడేళ్ల పాటు ఉండేందుకు సిద్ధమే. దమ్ముంటే మూసీ నదీ లోతు పెంచి, బలమైన కోల్‌కతా లాంటి నగర నిర్మాణం చేయాలి. సరైన డీపీఆర్ లేకుండా ముందుకెళ్లడం మూర్ఖత్వం అవుతుంది. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటూ వారి తరఫున న్యాయపోరాటం చేస్తుంది' అని అన్నారు. శనివారం నాగోల్‌లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని(STP) GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు.