ప్రియుడి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య (వీడియో)

59చూసినవారు
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లా మౌదర్వాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా ఖైర్‌బంద్‌లో ఓ ప్రియుడు తన ప్రియురాలికి మరోకరితో వివాహం జరిగిన తర్వాత.. ఆమెను భర్తను విడిచిపెట్టమని బలవంతం చేస్తున్నాడు. భర్తను విడిచిపెట్టకపోతే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను తన భర్తకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్