మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఆ కార్లకు రీకాల్

80చూసినవారు
మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఆ కార్లకు రీకాల్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆల్టో కే10 మోడల్‌లో 2555 కార్లకు రీకాల్ ప్రకటించింది. ఒక బ్యాచ్‌ కార్లలో స్టీరింగ్ గేర్ బాక్స్‌ లోపాన్ని గుర్తించామని, ఆ కార్లు కొనుగోలు చేసిన యజమానులందరినీ సంప్రదిస్తున్నామని తెలిపింది. దీని వల్ల స్టీరింగ్ పనితీరు విఫలం కావడం, ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని వివరించింది. కాబట్టి ఆ విడిభాగాన్ని రీప్లేస్ చేసే వరకు ఆయా కార్ల యజమానులు వాటిని నడపొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్