ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం లక్నో యజమాని సంజీవ్ గోయెంకాతో రోహిత్ శర్మ సంభాషించారు. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ వారి వద్దకు వస్తుండగా రోహిత్ మాట్లాడుతూ.. "సర్ మీరు ఎందుకు ఆందోళన పడతారు. మీ వైపు లార్డ్ ఉండగా మీకు టెన్షన్ అవసరం లేదు" అని అన్నారు. శార్దూల్‌ను అంతా ‘లార్డ్’ అంటూ పిలుస్తుంటారు.