కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పలు రాజకీయ పార్టీలతో ఎంపీడీవో కృష్ణవేణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అఖిలపక్షం నాయకులతో ఓటర్ లిస్ట్ ముసాయిదాపై ప్రత్యేక
సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా గ్రామాలలో ఓటర్ లిస్టు పై అభ్యంతరాలను రాజకీయ పార్టీ నాయకులతో తెలుసుకున్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కరిస్తామన్నారు.