మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. జెండా వందనం చేసి జాతీయ గీతం ఆలపించారు. మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.