టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్‌లతో బుధవారం కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు కానున్నారు. కులగణనపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో ఇవాళ జరగనున్న ప్రజావాణి వాయిదా పడింది.