నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో వార్డు నెం 3, తిలక్ నగర్ యందు మంగళ వారం పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణంను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, పట్టణములో ఎక్కడ కూడా మురుగు నీరు నిలవకుండా ప్రత్యేకంగా మురికి కాలువలు మరియు అంతర్గత మురికి కాలువలను నిర్మిస్తున్నామని తిలక్ నగర్ కాలనీ యందు మురుగునీటి కాలువలు లేక మురుగునీరు రోడ్లపై పారుతూ అక్కడి ప్రజలకు ఇబ్బందులు పడుతుండడంతో ఇట్టి సమస్య పరిష్కారానికి సుమారు 3 లక్షలతో అంతర్గత మురుగు కాలువ నిర్మాణం పనులు ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సూర్యప్రకాష్ రావు, నాయకులు మనోహర్ రెడ్డి, లింగారెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి, కాలనీ వాసులు మరియు పుర సిబ్బంది కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.