హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేసిన సీఐ, ఎస్సై

544చూసినవారు
హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేసిన సీఐ, ఎస్సై
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కోవిడ్ బాధితులకు ఏర్పాటు చేసిన హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్లను కల్వకుర్తి సీఐ సైదులు, ఎస్సై మహేందర్ కిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణం, మండలంలోని ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా వారికి 10 రకాల సంబంధించిన మందులు అందజేస్తానని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్క్, సానీటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ దైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిన్న రాంరెడ్డి, గోరట, ఏజాస్, గోరటి శ్రీను, హన్మనాయక్, చిన్న, సతీష్, కో-అప్షన్ సాబేర్, ప్యాక్స్ డైరెక్టర్ బన్నే శ్రీను, ఎంపీటీసీ పవన్ కుమార్ రెడ్డి, జెఏసి ఛైర్మన్ సదానందం గౌడ్, బీసీ సబ్ ప్లాన్ గోపాల్, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, యువనాయకులు పడకంటి వెంకటేష్, పులిజ్వాల చంద్రకాంత్, దున్న సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్