కల్వకుర్తి పట్టణంలో ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా, మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందచేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం. మున్సిపల్ పరిధిలోని కొట్రా తండాలో నివాసం ఉంటున్న కేతవత్ అంజ్య నాయక్ మరణించారు. వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సోమవారం రూ. 5000 ఆర్థిక సహాయం చేశారు.