ఉట్కూర్: డాక్టరేట్ అందుకున్న స్వామిజీకి సన్మానం
ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని అంబాత్రేయ క్షేత్రంలో ఆదిత్య పరాశ్రీ స్వామిజీ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా మంగళవారం బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కృష్ణ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడం పట్ల స్వామిజీకి డాక్టరేట్ అందుకున్నారని అన్నారు. మునుముందు మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.