ఆత్మకూరు: సీపీఐ ఆవిర్భావ వేడుకలు తరలిన నేతలు
సిపిఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నల్లగొండలో జరిగే బహిరంగ సభకు అమరచింత మండలం నుండి సీపీఐ పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ. వంద సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ పేదల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ పోరాటాలు చేసి సమాజంలో అనేక మార్పులకు కారణమైందని అన్నారు.