అనునిత్యం పేద ప్రజల సమస్యలపై పోరాడి, గీత కార్మికుల గొంతుకై నినదించిన వ్యక్తి కామ్రేడ్ దర్మబిక్షం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సింహారెడ్డి అన్నారు. శనివారం సీపీఐ, గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో ధర్మబిక్షం 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, రామస్వామి, జయరాములు తదితరులు పాల్గొన్నారు.