కొండమల్లేపల్లి: పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరవడానికి వచ్చిన రైతుపై ఎస్పిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరి అనే రైతు పత్తి అమ్మగా పోస్ట్ ఆఫీస్ లోని తన ఖాతాలో నగదు జమైంది. అతడిది జీరో అకౌంట్ కావడంతో అదనంగా మరో ఖాతా ఓపెన్ చేసినందుకు సోమవారం పోస్ట్ ఆఫీస్ కి వచ్చాడు. ఖాతా ఓపెన్ చేయడానికి 500 రూపాయలు చెల్లించాలని సబ్ పోస్ట్ మాస్టర్ తెలిపాడు. ఆ తరువాత 1000 రూపాయలు చెల్లించాలని అనడంతో అక్కడ వాగ్వాదం జరిగింది.