ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ ను తొలగించాలి
కోదాడ మండలం ఎర్రవరం ప్రాథమిక సహకార సంఘం సమావేశం రసాభాసగా మారింది. సొసైటీ చైర్మన్ నలజాల శ్రీనివాస రావు సంఘం సభ్యుల తీర్మానం లేకుండా నాలుగు లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం చేశారని సభ్యులు సమావేశంలో వాగ్వివాదానికి దిగారు. చైర్మన్ ను తొలగించాలని ఎగ్జిక్యూటివ్ బాడీకీ, డిఎస్ఓ కు పిర్యాదు చేశారు. దీంతో సమావేశాన్ని చైర్మన్ రద్దు చేశారు.