బైక్ అదుపు తప్పి కాల్వలో గల్లంతయిన అంగన్వాడీ టీచర్

78చూసినవారు
బైక్ అదుపు తప్పి కాల్వలో గల్లంతయిన అంగన్వాడీ టీచర్
వేములపల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ శనివారం ఉదయం తన భర్తతో బైక్ పై ఆమనగల్లు గ్రామ పరిధిలోని రావువారిగూడేనికి విధులకు వెళ్లి మరల సాయంత్రం తిరిగి వస్తుండగా రావులపెంట గ్రామ శివారు సాగర్ ఎడమ కాల్వ వద్ద బైక్ అదుపు తప్పి టీచర్ ఆమె భర్త కాలువలో పడ్డారు. టీచర్ భర్త క్షేమంగా బయట పాడగా, అనూష టీచర్ కాలువలో గల్లంతయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్