మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశము ఘనంగా ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగ్యా నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కే. కవిత మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల దశ కీలకమని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా జీవితంలో రాణించాలంటే అది పాఠశాల స్థాయి నుండే నిర్మితమవుతుందన్నారు.