మిర్యాలగూడ మండల కేంద్రంలో హిందు వాహిని చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందు వాహిని నాయకులు బంటు సైదులు మాట్లాడుతూ శివాజీ లాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను యువత అధ్యయనం చేయాలని, తద్వారా దేశ పునర్నిర్మాణంలో ఆరోగ్యకరమైన నాయకులు, యువత తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైందవ వీరులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.