దళిత సంఘాల ఐక్య సమావేశం వస్కుల మట్టయ్య అధ్యక్షతన జ్యోతిరావు పూలే భవన్ లో శుక్రవారం జరిగింది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రావు జయంతి, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సభలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ ప్రజలు ఈ సభల్లో పాల్గొనాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభల నిర్వహణ గురించి మున్సిపల్ కమి షనర్ కు వినతి పత్రం అందచేశారు.