తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంపీ కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గీత పనివారల సంఘం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకరయ్య గౌడ్ అన్నారు. ధర్మ బిక్షం 103వ జయంతిని పురస్కరించుకొని శనివారం చండూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.