మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

17218చూసినవారు
మునుగోడు నియోజక వర్గంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్న నేపథ్యంలో నిరసన తెలపడానికి వెళ్తున్న నియోజక వర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..మునుగోడు నియోజక వర్గానికి రూపాయ నిధులు ఇవ్వని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సిగ్గుండాలని విరుచుకుపడ్డాడు. చిన్న కార్యక్రమాలకు హాజరవుతూ టీఆర్ఎస్ గుండాలతో పోలీసులతో అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు అర్ధరాత్రి నుంచి 2000పైగా కాంగ్రెస్ కార్యకర్తలను ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం చేయడం హేయమైన చర్య అని అన్నారు. సీఎం కెసిఆర్ హుజురాబాద్ ఎన్నికల స్టంట్ దళిత బంధు పథకం అంటూ ఎస్సీలను మరోసారి మోసం చేస్తున్నారని కేవలం ఈటెల రాజేందర్ పై గెలుపుకోసమే సీఎం కెసిఆర్ దళిత బందు పేరుతో కుట్రపన్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత బంధు ఒక్క హుజురాబాద్ కె కాకుండా యావత్ తెలంగాణలోని అన్ని జిల్లాలోని దళితులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు. దళితులంతా ఏకమవ్వాలని సీఎం కెసిఆర్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్