శ్రీ రామనవమి సందర్భంగా ఆదివారం మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సకల జగతికి ఆనందకరమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కల్యాణం సందర్భంగా ఆ భద్రాద్రీశుడి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.