చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామంలో సీపీఎం, కేవీపీయస్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా, రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించిన రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహొన్నత కీర్తి శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.