నిన్న తనపై నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులకు సహకరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ యాలన్నారు. ఆయన వెంట రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు రామచంద్రు నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తదితరులు ఉన్నారు.