నల్గొండ: బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

72చూసినవారు
నల్గొండ: బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి
నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో రైతు ధర్నా నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు ధర్నా నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పలువురు నాయకులు హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్