మాడుగులపల్లి మండల ముస్లిం సోదర సోదరీమణులందరికీ సోమవారం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ మండల మాజీ యూత్ అధ్యక్షులు గనిపల్లి మోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు.