పాత బస్తీలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం

81చూసినవారు
పాత బస్తీలో మిషన్ పరివర్తన్ కార్యక్రమం
నల్గొండ పట్టణంలోని పాతబస్తీ చౌరస్తాలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాలపై పోలీస్ కళాజాత బృందం వారు అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐ రాజశేఖర్ రెడ్డి కోరారు. గంజాయి తాగిన, గంజాయి అమ్మిన సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జూకురి సైదులు, ఉప్పు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్