టన్నెల్ ప్రమాద విషయంలో బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. సొరంగం తవ్వకాల సమయంలో వచ్చిన వాటర్ లీకేజ్ కారణంగా ప్రమాదం సంభవించిందని నిర్ధారించుకున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కూడా ఇటువంటి లీకేజులు జరిగాయి. జరిగిన ప్రదేశం లో క్రిటికల్ పోజిషన్ ఉంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు.