నల్గొండ: భర్త దాడి.. భార్య మృతి

67చూసినవారు
నల్గొండ: భర్త దాడి.. భార్య మృతి
భార్యపై భర్త దాడి చేయగా ఆమె మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండారు మహేశ్వరి(23)కి కేతేపల్లి మండలం బండకిందగూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ 5 ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా, భార్యపై అనుమానంతోనే భర్త ఆమెపై ఈనెల 1న సర్వారంలో దాడి చేశాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా సోమవారం కన్నుమూసింది.

సంబంధిత పోస్ట్