కారుణ్య నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్న వారికి నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వీస్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో నిలిచేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.