పట్టణంలో క్రికెట్ మినీ స్టేడియం ఫ్రెండ్లీ క్రికెట్ క్లబ్ ను ఆదివారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మినీ స్టేడియాల ద్వారా క్రికెట్ ఆసక్తిపరులు తొలిమెట్టుగా క్రీడా నైపుణ్యం సాధించి వివిధ పోటీల్లో గెలుపొంది జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు.