నల్గొండ ఎంజీయూలో ఈనెల 7న శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సహకారంతో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ వై. ప్రశాంతి, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లు వెంకట్, శేఖర్, సత్య నారాయణరెడ్డి, సమ్రీన్ బేగం శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9010203857 నంబర్‌ను సంప్రదించాలన్నారు.