బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి సోమవారం నల్గొండ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ వోల్టేజి సమస్య, కరెంటు కోతలు లేకుండా చూడాలని, పంట ఎండిపోయిన రైతుకు ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.