సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులతో ఏఎమ్ఆర్ పి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్, మరమ్మతు పనులను చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం అయన ఎ ఎం ఆర్ పి ఆయకట్టు పరిధిలోకి వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపం లోని మైల సముద్రం చెరువు వద్ద సాగునీటిని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని గ్రామాలకు సాగునీటిని ఇవ్వడం జరిగిందని అన్నారు.