ఏప్రిల్ 25 నాటికి నల్గొండ సమీపంలోని శేషమ్మ గూడెం వద్ద చేపట్టిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, నల్గొండ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జె. శ్రీనివాస్ , ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును తనిఖీ చేశారు.